IRCTC: జనరల్ క్లాస్ ప్రయాణీకులకు శుభవార్త..
- July 23, 2025
న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వేలు, ముఖ్యంగా ఐఆర్సిటిసి (IRCTC) ప్రయాణికుల సౌకర్యం కోసం మరో ముందడుగు వేసింది.ఇప్పటివరకు జనరల్ కోచ్‌లో ప్రయాణించే వారికి తినే విషయమై అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి.ఈ సమస్యను పరిష్కరించేందుకు తాజాగా ఐఆర్సిటిసి ప్రత్యేక ఆహార సేవలను ప్రారంభించింది.జనరల్ క్లాస్‌లో ప్రయాణించే వారికి నాణ్యమైన భోజనాన్ని నేరుగా వారి సీటు వద్దకు అందించనున్నారు.ఇది ఏసీ కోచ్ ప్రయాణికులకు ఇచ్చే భోజనంతో సమానంగా ఉంటుంది.
రూ.80కే నాణ్యమైన భోజనం–ఫుడ్ బాక్స్ స్పెషాలిటీ
ఈ పథకం కింద అందించే భోజనం అన్నం, పప్పు, కూర, రొట్టె, ఊరగాయ లాంటి పౌష్టికమైన పదార్థాలతో కూడి ఉంటుంది. వీటిని శుభ్రంగా ప్యాక్ చేసి అందించనున్నారు. ఒక్కొక్క భోజన ఫుడ్ బాక్స్ ధర కేవలం రూ.80 మాత్రమే. పైగా ఇందులో చెంచా, నాప్కిన్ వంటి అవసరమైన సామగ్రి కూడా ఉంటాయి. జనరల్ కోచ్ ప్రయాణికులు ఇక తినేందుకు బుక్ చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం కోచ్‌లోనే వీటిని పొందే అవకాశం కలుగుతుంది.
కొత్త సేవలు ప్రారంభమైన రైళ్లు, స్టేషన్లలో సీటింగ్ సౌకర్యం కూడా
ఈ సేవలు మొదటగా కొన్ని ముఖ్య రైళ్లలో ప్రారంభమయ్యాయి. గోమతి ఎక్స్‌ప్రెస్, కైఫియత్ ఎక్స్‌ప్రెస్, శ్రీనగర్ గంగానగర్-న్యూఢిల్లీ ఇంటర్సిటీ, అయోధ్య ఎక్స్‌ప్రెస్, బరౌని–న్యూఢిల్లీ క్లోన్ ఎక్స్‌ప్రెస్, దర్భంగా–న్యూఢిల్లీ క్లోన్ ఎక్స్‌ప్రెస్ మొదలైన రైళ్లు ఇందులో ఉన్నాయి. అంతేకాక, న్యూఢిల్లీ, వారణాసి, గోరఖ్‌పూర్, లక్నో వంటి స్టేషన్లలో జనరల్ క్లాస్ ప్రయాణికులకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. దీంతో వారు నిలబడి తినాల్సిన అవసరం లేకుండా కూర్చొని సౌకర్యంగా భోజనం చేయవచ్చు. ప్రయాణికుల అభ్యున్నతికై చేపట్టిన ఈ చర్యపై ప్రజలు ఐఆర్‌సిటిసీని ప్రశంసిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!