స్విమ్స్ లో నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించిన టిటిడి ఛైర్మెన్
- July 23, 2025
తిరుపతి: స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న వివిధ విభాగాలకు సంబంధించిన భవనాలను టిటిడి ఛైర్మెన్ బీ.ఆర్ నాయుడు పరిశీలించారు.టిటిడి ఈవో జె.శ్యామల రావు, స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్ లతో కలిసి బుధవారం కార్డియాక్ న్యూరో సైన్సెస్, స్విమ్స్ పాత భవనం, స్టాఫ్ క్వార్ట్స్ లను పరిశీలించారు.
ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, నిర్మాణంలో ఉన్న పనులు మరింత నాణ్యంగా చేప్టటాలని అధికారులకు సూచించారు.పెండింగ్ లో ఉన్న పనులు, డిజైన్లు , వైద్య పరికరాలు, సిబ్బంది తదితర అంశాలను నిర్ణీత సమయానికి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు.
అంతకుముందు, స్విమ్స్ ఆసుపత్రి పనుల పురోగతిపై బుధవారం చైర్మన్ సిమ్స్ పరిపాలనా భవనంలోని సమావేశం మందిరంలో ఈవో జె.శ్యామల రావుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సిమ్స్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ విభాగాలకు సంబంధించిన వివరాలపై స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి కుమార్, టిటిడి ఇంజనీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT)ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, ఎన్.సదాశివరావు, జేఈవో వి. వీరబ్రహ్మం,సిఈ టి వి సత్యనారాయణ, ఎస్ ఈలు మనోహర్,వేంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, వైద్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!