చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు: పవన్ కళ్యాణ్

- July 23, 2025 , by Maagulf
చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు: పవన్ కళ్యాణ్

అమరావతి: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన “హరిహర వీరమల్లు” చిత్రం జులై 24న విడుదలకు సిద్ధమైంది.ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ హాజరయ్యారు. అభిమానుల మధ్య మెరిసిన పవన్, సినిమాతో పాటు తన రాజకీయ భావోద్వేగాలపై కూడా స్పందించారు.ఈ వేళ పవన్ మాట్లాడుతూ, తన సినిమాకు టికెట్ ధరలు పెంచేందుకు అవకాశం కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.అలాగే, సినిమా విజయం కోసం సోషల్ మీడియాలో మద్దతుగా పోస్ట్ చేసిన నారా లోకేశ్కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

తనపై జరుగుతున్న విమర్శలపై కూడా పవన్ స్పందించారు. “ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టాను అంటాడు” అంటూ విమర్శించే వారిని బావిలో కప్పలతో పోల్చారు. ఆవిషయాన్ని ఎత్తి చూపుతూ, తన పేరులోనే గాలి ఉందని, కాబట్టి ఎక్కడైనా ఉంటానని చురక వేశారు.పవన్, చిత్రరంగంలోకి రావడానికి ముందు విశాఖలో నటనలో నైపుణ్యం పెంచుకున్నట్టు తెలిపారు. బాల్యంలో తాను ఏవైనా కోరికలతో ఎదగలేదని, అయితే అన్యాయం జరిగితే నిలదీయాలనే తపన ఉండేదని చెప్పారు. డబ్బు కోసమో, ఫేమ్ కోసమో సినిమాల్లోకి రాలేదన్నారు.

తన జీవితంలో తన అన్నయ్య, వదిన ఇద్దరూ దేవతలే అని పవన్ చెప్పారు.వారి నమ్మకమే తనకు బలం అని వివరించారు. నటన కన్నా ఫిలిం మేకింగ్ పైనే ఎక్కువ ఆసక్తి ఉన్నదని తెలియజేశారు.ఈ సినిమా తొలుత క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమై 30% షూటింగ్ పూర్తయిందని చెప్పారు. అయితే, వ్యక్తిగత కారణాలతో క్రిష్ తప్పుకోవడంతో, దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చేపట్టి సినిమాను దూసుకుపోతున్నారని వివరించారు. సినిమా టీజర్‌తో అన్ని అనుమానాలూ తొలగిపోయాయని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com