రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- October 13, 2025
ఈజిప్ట్ : గాజా కాల్పుల విరమణ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతుండగా షర్మ్ ఎల్ షేక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.
షర్మ్ ఎల్ షేక్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని, ఖతార్ ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థానీతో పాటు వెళ్తున్న కాన్వాయ్‌లో ఒక వాహనం ప్రమాదానికి గురైందని ఈజిప్టుకు చెందిన అల్ కహెరా అల్ ఎఖ్బారియా తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఖతార్ పౌరులు, ఒక ఈజిప్టు డ్రైవర్ ఉన్నాడని తెలిపారు.
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌద్ బిన్ థామర్ అల్ థాని సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన ఇద్దరు దౌత్యవేత్తలు షర్మ్ ఎల్ షేక్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మరణించిన వారి మృతదేహాలను ఖతార్‌కు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ముగ్గురు దౌత్యవేత్తల మరణం పట్ల ఈజిప్టులోని ఖతార్ రాయబార కార్యాలయం "తీవ్ర విచారం" వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!