నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- October 13, 2025
దోహా : ఖతార్ వేదికగా నవంబర్ 4 నుంచి FIBA బాస్కెట్బాల్ వరల్డ్ కప్ 2027 ప్రారంభం అవుతుందని లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ (LOC) తెలిపింది.ఖతార్ స్కూల్ స్పోర్ట్స్ అసోసియేషన్ సహకారంతో ఈ గేమ్స్ ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.ఇది 2025-2026 మరియు 2026-2027 రెండు సీజన్లలో జరుగుతుందన్నారు.
ఈ టోర్నమెంట్ స్కూల్ ఒలింపిక్ ప్రోగ్రామ్ కిందకు వస్తుందని, ఖతార్ బాస్కెట్బాల్ ఫెడరేషన్తో కలిసి FIBA పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ పాఠశాల స్థాయిలో యువ ఆటగాళ్లకు నిజమైన ప్రపంచ కప్ అనుభవాన్ని అందిస్తుందని ప్రకటించారు.
ఈ మేరకు ఖతార్ ఒలింపిక్ కమిటీ (QOC) ప్రధాన కార్యాలయంలో ఖతార్ స్కూల్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ ఖలీద్ అల్ థాని వెల్లడించారు. మొదటి సీజన్ నవంబర్ 4 నుండి 2026, ఏప్రిల్ వరకు జరుగుతుందని, ఖతార్ వ్యాప్తంగా 32 సెకండరీ స్కూల్స్ ఇందులో పాల్గొంటున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం