కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- October 13, 2025
కువైట్: టాలీవుడ్ లో ప్రముఖ రాక్‌స్టార్‌గా ప్రసిద్ధి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) తన ఉత్సాహభరితమైన లైవ్ బ్యాండ్‌తో కువైట్ లో సందడి చేయనున్నారు. “DSP Live @ Kuwait”పేరిట దీనిని నిర్వహించనున్నారు. కువైట్ లోని తెలుగు కళా సమితి (TKS) అక్టోబర్ 24న సాయంత్రం 4:00 గంటల నుండి మన్సౌరియాలోని అల్ అరబి స్పోర్ట్స్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో చార్ట్-టాపింగ్ హిట్లకు పేరుగాంచిన DSP.. తెలుగు, తమిళం మరియు హిందీ సినిమాలలోని అద్భుతమైన పాటలను ఆలపించి సంగీత అభిమానులను మంత్రముగ్ధులను చేయనున్నారు.
కువైట్ అంతటా ఫ్రీ ఎంట్రీ పాస్ పంపిణీ ఇప్పటికే ప్రారంభమైందని తెలుగు కళా సమితి (TKS) అధ్యక్షుడు హేమచంద్ బస్వ తెలిపారు. ఉచిత పాస్‌ల కోసం తమను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!