అక్రమ గృహ విభజనలపై కఠిన చర్యలు.. SR200,000 వరకు ఫైన్స్..!!

- July 24, 2025 , by Maagulf
అక్రమ గృహ విభజనలపై కఠిన చర్యలు.. SR200,000 వరకు ఫైన్స్..!!

రియాద్: గృహనిర్మాణ యూనిట్లను చిన్న విభాగాలుగా విభజించడం, అంతర్గతంగా తలుపులు పెట్టడం వంటి కీలక ఉల్లంఘనలను గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. ఇంటికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన వారికి SR200,000 వరకు ఫైన్స్ ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. మౌలిక సదుపాయాలలో మార్పుల కారణంగా మునిసిపల్ సేవలు దెబ్బతీంటాయని హెచ్చరించింది.  

మంత్రిత్వ శాఖ మద్దతుతో "బాలడీ" యాప్ ద్వారా సమర్పించిన ఆన్-గ్రౌండ్ తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  అనధికార గృహ మార్పులను స్పష్టమైన ఉల్లంఘనగా పరిగణించబడతాయని స్పష్టం చేసింది.   "బాలడీ" యాప్ ద్వారా లేదా ఏకీకృత హాట్‌లైన్ (940) కు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘనలను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com