ఆయిల్ ఇండియా రిక్రూట్‌మెంట్..
- July 24, 2025
నిరుద్యోగులకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో గ్రేడ్ III, గ్రేడ్ V, గ్రేడ్ VII ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ లో భాగంగా 262 పోస్టులను భర్తీ చేయనుంది.దీనిని సంబందించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 18తో గడువు ముగియనుంది. కాబట్టి, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://oil-india.comద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత:
టెన్త్, ఇంటర్, బి.ఎస్సీ, నర్సింగ్ డిప్లొమా/హిందీ ఆనర్స్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 38 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, PwBD కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (పీడబ్ల్యూబీడీ), మాజీ సైనికులకు ఎలాంటి దరఖాస్తు రుసుము ఉండదు.
వేతన వివరాలు:
గ్రేడ్ III లో పనిచేసే వారికి: రూ.26,600 నుంచి రూ. 90,000 వరకు జీతం ఉంటుంది.
గ్రేడ్ V లో పనిచేసే వారికి: రూ.32,000 నుంచి రూ.1,27,000 వరకు జీతం ఇస్తారు.
గ్రేడ్ VII లో పనిచేసే వారికి: నెలకు రూ.37,500 నుంచి రూ.1,45,000 వరకు జీతం లభిస్తుంది. వీటితో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలు కూడా అందుతాయి.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..