రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన కమల్‌హాసన్
- July 25, 2025
చెన్నై: రాజ్యసభ ఎంపీగా సినీనటుడు కమలహాసన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు.తమిళంలో ఆయన చేసిన ప్రమాణస్వీకారం పలువురిని ఆకట్టుకుంది. డీఎంకే పార్టీ మద్దతుతో కమల్‌హాసన్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన విషయం విధితమే. ఇటీవల కన్నడభాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఓ సినిమా ప్రమోషన్ సమావేశంలో కన్నడభాషను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేకిత్తించాయి.కమల్‌హాసన్ క్షమాపణలు చెప్పకపోతే కర్ణాటకలో అతని సినిమాలను బ్యాన్ చేస్తామని కన్నడ ప్రజలు హెచ్చరించారు. అతనిపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.మొదటినుంచి వివాదాస్పదకుడి కమల్‌హాసన్ పేరుంది. ఏదీఏమైనా ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కావడం సినీ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. రాజ్యసభలో కమలహాసన్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడంతో భవిష్యత్తులో సినిమాల్లో నటిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







