ఇండో-బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ఏపీ రైతులకు వరం
- July 25, 2025
లండన్: జూలై 23-24, 2025 తేదీల్లో బ్రిటన్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో కలిసి ఇండో-బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం (FTA) పై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $120 బిలియన్కు చేర్చే లక్ష్యాన్ని నిర్దేశించింది. 2023-24లో $55 బిలియన్‌గా ఉన్న వాణిజ్యం ఈ ఒప్పందం ద్వారా రెట్టింపు కానుంది.
ఆక్వా రైతులకు ప్రయోజనాలు
ఈ ఒప్పందం భారతదేశం నుండి బ్రిటన్‌కు ఎగుమతి అయ్యే 99% ఉత్పత్తులపై సుంకాలను తొలగించింది, ఇందులో ఆక్వా ఉత్పత్తులు ప్రధానమైనవి.ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆక్వా రైతులు బ్రిటన్‌లోని $5.4 బిలియన్ సీఫుడ్ మార్కెట్‌లో సులభంగా చోటు సంపాదించనున్నారు.ఈ సుంకాల తొలగింపు వల్ల రైతులు ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. జాక్‌ఫ్రూట్, మిల్లెట్స్, ఆర్గానిక్ హెర్బ్స్ వంటి ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు కూడా మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి.
బ్రిటిష్ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు
ఈ ఒప్పందం ద్వారా బ్రిటన్ నుండి భారత్‌కు దిగుమతి అయ్యే 90% ఉత్పత్తులపై సుంకాలు తగ్గించబడ్డాయి. స్కాచ్ విస్కీపై సుంకం 150% నుండి 75%కి, 2035 నాటికి 40%కి తగ్గనుంది. అలాగే, లగ్జరీ కార్లుపై సుంకం 100% నుండి 10%కి తగ్గించబడుతుంది, దీనివల్ల రోల్స్-రాయిస్, బెంట్లీ వంటి బ్రాండ్లు భారత్‌లో సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయి.
కింగ్ చార్లెస్ తో సమావేశం
పర్యటనలో భాగంగా, మోదీ జూలై 24, 2025న నార్ఫోక్‌లోని సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్లో కింగ్ చార్లెస్ ని కలిశారు. “ఏక్ పెడ్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా మోదీ కింగ్ చార్లెస్‌కు సోనోమా డోవ్ ట్రీ మొక్కను బహుమతిగా అందించారు.ఈ మొక్క అలంకార ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది మరియు పూర్తి చెట్టుగా మారడానికి రెండు దశాబ్దాల సమయం పడుతుంది. ఈ సమావేశం ఇరు దేశాల సాంస్కృతిక, దౌత్య సంబంధాలను బలోపేతం చేసింది.
యువ క్రికెటర్లతో సమావేశం
మోదీ మరియు స్టార్మర్ లండన్‌లోని బకింగ్‌హామ్ స్ట్రీట్ క్రికెట్ హబ్లో యువ క్రికెటర్లతో సమావేశమయ్యారు.క్రికెట్ కేవలం ఆట కాదని, ఇది ఇరు దేశాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే జీవన విధానమని మోదీ అన్నారు. ఈ సమావేశం ప్రజల మధ్య సంబంధాలను మరింత బలపరిచింది.
పహల్గామ్ దాడి ఖండన
మోదీ మరియు స్టార్మర్ జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై రెట్టింపు వైఖరులకు తావు లేదని, ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వారిని అనుమతించరాదని మోదీ పేర్కొన్నారు.ఈ దాడిని ఖండించిన బ్రిటన్ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
మాల్దీవుల పర్యటన
బ్రిటన్ పర్యటన తర్వాత, MODI జూలై 25-26, 2025న మాల్దీవులకు వెళ్లనున్నారు. మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవంలో అతిథిగా పాల్గొననున్నారు. ఈ పర్యటన భారత్-మాల్దీవుల దౌత్య సంబంధాలను బలోపేతం చేస్తుంది.
తాజా వార్తలు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!
- KNET లో కొత్తగా డైరెక్ట్ కార్డ్ ఎంట్రీ సిస్టమ్.. పోర్టల్ అప్‌గ్రేడ్..!!
- ఒమన్ లో డిజిటల్ మీడియాకు లైసెన్సులు తప్పనిసరి..!!
- డైమండ్ హోదాను పొందిన కింగ్ ఫైసల్ హాస్పిటల్..!!
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!









