ప్రధాని మోదీలో దమ్ము లేదు: రాహుల్ గాంధీ

- July 25, 2025 , by Maagulf
ప్రధాని మోదీలో దమ్ము లేదు: రాహుల్ గాంధీ

న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో జరిగిన ‘న్యాయ్ సమ్మేళన్’ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్, మోదీపై నిశితంగా వ్యాఖ్యలు చేశారు. “నిజం చెప్పాలంటే మోదీకి ధైర్యం లేదు. ఆయనపై క్రియేట్ అయ్యే హైప్ అంతా మీడియా ద్వారా. అంతా ఒక షో మాత్రమే,” అని అన్నారు. మోదీని తాను మూడు సార్లు కలిశానని చెప్పిన రాహుల్, ఆయన వ్యక్తిత్వం పూర్తిగా ప్రచారంపై ఆధారపడిందని పేర్కొన్నారు.

మోదీ అంతటి పెద్ద సమస్య కాదని రాహుల్ స్పష్టం చేశారు. “అయనను దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. మోదీ నిజమైన నాయకత్వ లక్షణాలు కలవాడు కాడు. ప్రజల్లో భయం కలిగించేలా ఆయనను మీడియా చూపిస్తుంది. వాస్తవానికి మోదీ తక్కువ ధైర్యం కలవాడు,” అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఈ మాటల ద్వారా ప్రధాని మోదీ పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాహుల్ గాంధీ న్యాయ్ సమ్మేళన్ వేదికగా మరోసారి దాడి చేశారు. సామాజిక న్యాయం, ఐక్యతే తమ లక్ష్యమని, ప్రజల హక్కులు కాపాడటమే తమ దృష్టి అని చెప్పారు. దేశంలో వర్గాల మధ్య చిచ్చు పెడుతూ, సెంట్రలైజ్డ్ పాలన రాబోతున్న మోదీ విధానాలను ప్రజలు గమనించాలన్నారు. న్యాయ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా అన్యాయాన్ని ఎదుర్కొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com