మానవత్వానికి శతృవు తీవ్రవాదం
- July 16, 2016
డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఉగ్రవాదులు దాడి జరిపిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తీవ్రవాదం అనేది మానవత్వానికి శతృవని ఆయన అభివర్ణించారు. దాడుల్లో వివిధ మతాలకు చెందినవారు చనిపోతున్నారనీ, ఉగ్రవాదానికి లక్ష్యం అంటూ లేదనడానికి ఇదే కారణమని ఆయన చెప్పారు. ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని క్షమించదని చెప్పారు షేక్ సైఫ్. అందరం కలిసి తీవ్రవాదాన్ని సంయుక్తంగా ఎదుర్కొని, దాన్ని అంతమొందించాల్సి ఉందని ఆయన వివరించారు. ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ కూడా ఫ్రాన్స్‌లో జరిగిన ఉగ్రదాడిని ఖండించింది. ఎఫ్‌ఎన్‌సి స్పీకర్ డాక్టర్ అమాల్ అబ్దుల్లా అల్ కుబాసి, ఫ్రెంచ్ సెనేట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్ మరియు నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ క్లాడె బర్టోలిన్‌కి రెండు లేఖల్ని సంతాపం తెలుపుతూ పంపించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







