సౌదీ అరేబియాలో భారీగా డ్రగ్స్, ఇల్లీగల్ ఐటమ్స్ సీజ్..!!

- July 27, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో భారీగా డ్రగ్స్, ఇల్లీగల్ ఐటమ్స్ సీజ్..!!

రియాద్: అక్రమ రవాణా, అక్రమ పదార్థాల నుండి సమాజాన్ని రక్షించడానికి ఉక్కుపాదం మోపుతామని సౌదీ అరేబియా కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 1,464 అక్రమ వస్తువులను జప్తు చేసినట్లు వెల్లడించారు.స్వాధీనం చేసుకున్న వాటిలో హషిష్, కొకైన్, హెరాయిన్, మెథాంఫెటమైన్, కాప్టాగన్ మాత్రలు వంటి 119 రకాల మాదకద్రవ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.వీటితోపాటు 664 నిషేధిత వస్తువులు, 86 రకాల ఫేక్ కరెన్సీ, 12 రకాల ఆయుధాలు,  2,531 పొగాకు ఉత్పత్తులను సీజ్ చేసినట్లు కస్టమ్ అధికారులు తెలిపారు. 

ఏవైనా ఉల్లంఘనలను నివేదించడం ద్వారా అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి, సమాజ- జాతీయ ఆర్థిక వ్యవస్థ రెండింటినీ రక్షించడానికి ప్రజలు సహకరించాలని జకాత్, టాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA)  పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com