ఏక్షణమైనా ఇండియా లో దాడులు జరగవచ్చు: ఇంటెలిజెన్స్ బ్యూరో
- July 16, 2016
ఫ్రాన్స్‌లోని నీస్‌లో ఇటీవల ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రెచ్చిపోయిన ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. బాస్టిల్ డే సంబరాల్లో పాల్గొంటోన్న ప్రజలపైకి ఉగ్రవాది భారీ ట్రక్కుతో దూసుకెళ్లి దారుణంగా దాడి చేశారు. అయితే ఇటువంటి దాడే ఇండియాలోనూ జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. భారీ వాహనాలతో దూసుకొచ్చి ఢిల్లీలో బీభత్సం సృష్టించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మంత్రులు, ఇతర వీఐపీల కాన్వాయ్‌ల లక్ష్యంగా ఈ దాడులు జరగవచ్చంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి. దీంతో నరేంద్ర మోదీ కాన్వాయ్ వెళ్లే రూట్‌లో ఢిల్లీ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని వెళ్లే రూట్‌లో వస్తున్న భారీ వాహనాలను ముఖ్యంగా ఆయిల్ ట్యాంకర్లను దారి మళ్లిస్తున్నారు. మరో మార్గం లేకపోతే పూర్తి తనిఖీ తర్వాత ప్రధాని వెళ్లేవరకు వాటిని ఎక్కడివక్కడ నిలిపి వేస్తున్నారు.
ప్రధానితోపాటు ఢిల్లీలోని ఇతర వీఐపీలకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి మరో 48 గంటల్లో తాజా మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఢిల్లీ పోలీసు అధికారులు శనివారం మీడియాకు తెలియజేశారు. భారీ వాహనాలను విచ్చిల విడిగా నడిపి ఢిల్లీలో బీభత్సం సృష్టించే ప్రమాదం ఉందంటూ వారం క్రితమే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందట. అయితే అప్పుడు దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో జరిగిన ట్రక్కు దాడి అనంతరం నగరంలోని భద్రతా బలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఫ్రాన్స్‌లో జరిగిన ట్రక్కు దాడిలో 80 మందికిపైగా అమాయకులు చనిపోయిన విషయం తెల్సిందే.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







