రష్యాలో భయంకరమైన భూకంపం..

- July 30, 2025 , by Maagulf
రష్యాలో భయంకరమైన భూకంపం..

రష్యాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై 8.8గా నమోదైంది.ఈ ప్రభావంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.రష్యాతో పాటు అమెరికా, జపాన్‌కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

రష్యా కురిల్ దీవుల్లో ప్రధాన నివాస ప్రాంతం సేవెరో-కురిల్స్‌క్ తీరాన్ని మొదటి సునామీ అల తాకింది అని స్థానిక గవర్నర్ వాలెరి లిమారెంకో చెప్పారు. అక్కడి ప్రజలు సురక్షితంగా ఉన్నారని, ప్రస్తుతం ఎత్తైన ప్రాంతాల్లోనే ఉన్నారని చెప్పారు. భూకంపం కారణంగా రష్యాలో అనేక భవనాలు కదిలాయి. దీంతో ప్రజలు భయంతో వణికిపోయారు.

రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. అక్కడి కొన్ని ప్రాంతాల్లో దాదాపు 10 అడుగులు ఎత్తున సునామీ అలలు కనపడ్డట్లు చెప్పారు.

జపాన్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. హొక్కైడో దక్షిణ తీరంలో ఉన్న టొకాచిలో 40 సెంటీమీటర్ల (1.3 అడుగులు) సునామీ అలలు కనపడ్డాయి. జపాన్‌లోని ఉత్తర భాగంలో ఉన్న ప్రధాన దీవుల్లో హొక్కైడో ఒకటి.

కాగా, సునామీ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ… హవాయి ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ అయ్యిందని తెలిపారు. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు కూడా ఈ ముప్పు ఉందని, ప్రజలు ధైర్యంగా ఉండాలని అన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ట్రంప్ సూచించారు. అధికారుల సూచనలను ప్రజలు పాటించాలని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com