నల్గురు సౌదీ మహిళలు రియో ఒలింపిక్స్ లో వెలగనున్నారు
- July 16, 2016
నల్గురు మహిళా సౌదీ క్రీడాకారులు ఆగస్టు 5 న ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. సౌదీ ఒలింపిక్స్ కమిటీ రియో లో పాల్గొనేవారి పేర్లు ఖరారు చేసింది. సారా అల్ అత్తరు లుబ్న అల్ ఆమిర్ , కెరిమం అబూ అల్ జాడైల్ మరియు వుజూడ్ ఫాహ్మి ఈ నల్గురు సౌదీ మహిళలు ఎంపిక కాబడ్డారు. ఇందులో సారా అల్ అత్తరు ఈమె 2012 లండన్ లో ఒలింపిక్స్ లో మారథాన్ పరుగు పందెంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. లుబ్న అల్ ఆమిర్ కత్తి యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. కెరిమం అబూ అల్ జాడైల్ 100 మీటర్ల రేసులో పాల్గొననున్నారు. వుజూడ్ ఫాహ్మి 52 కిలోల విభాగంలో జూడోలో తన ప్రతిభను చూపనున్నారు. దాల్మా మెల్లీస్ మరొక సౌదీ మహిళా క్రీడాకారిణి ఈమె కూడా ఒలింపిక్స్ ఈ సంవత్సరం హాజరవుతున్నారు. ఆమె సింగపూర్ యొక్క 2010 ఈక్వెస్ట్రియన్ కార్యక్రమాల్లో యువత కేటగిరిలో ఒక అంతర్జాతీయ పోటీలో పాల్గొన్న తొలి సౌదీ మహిళ.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







