ఇండియాకు ట్రంప్ షాక్..
- July 30, 2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు బిగ్ షాక్ ఇచ్చారు.ఇండియా పై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ లో ప్రకటించారు. దీంతో పాటు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ఇండియా పై పెనాల్టీ కూడా విధించారు ట్రంప్.
‘ఇండియా అమెరికాకి చాలా కాలం నుంచి మంచి మిత్రుడే.ఆ దేశంతో చాలా తక్కువ బిజినెస్ చేశాం. ఎందుకంటే వారి టారిఫ్ లు చాలా ఎక్కువ.ఒక రకంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టారిఫ్ లు ఇండియా అమలు చేస్తుంది. అలాగే, ఇండియా తన మిలటరీ ఎక్విప్ మెంట్ లో అత్యధిక భాగం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. రష్యా నుంచి అత్యంత ఎక్కువ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా, చైనా ఉన్నాయి.
ఓ వైపు ప్రపంచం మొత్తం రష్యా..యుక్రెయిన్ మీద యుద్ధం ఆపాలని చెబుతుంది. కానీ అంత మంచేం జరగడం లేదు. కాబట్టి ఇండియా మీద 25శాతం టారిఫ్ లు విధిస్తున్నాం. అలాగే, రష్యా నుంచి ఆయుధాలు, ఆయిల్ కొంటున్నందుకు పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్ట్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







