తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు
- August 01, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.తెలంగాణ యూనివర్సిటీలో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీని అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కొత్తగా ఏర్పాటు కానున్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో 4 కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన జీవో ఎంఎస్ నంబర్ 32ను విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇంజనీరింగ్ కాలేజీల్లో బిటెక్-సిఎస్ఈ, బిటెక్-సిఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), బిటెక్- కంప్యూటర్ సైన్స్ అండ్(CSE) ఐటీ, బిటెక్-డాటా సైన్స్ కోర్సుల్లో ఈ ఏడాది 2025-26 విద్యా సంవత్స రం నుంచి అడ్మిషన్లు తీసుకోనున్నట్టు విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున 240 సీట్లను భర్తీ చేయనున్నారు. అయితే ఇప్పటికే ఎప్ సెట్- 2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తయిన నేపథ్యంలో మూడో ఫేజ్లో తెలంగాణ యూనివర్సిటీకి మంజూరైన ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







