6న ‘గద్దర్’ ద్వితీయ వర్థంతి సభ

- August 01, 2025 , by Maagulf
6న ‘గద్దర్’ ద్వితీయ వర్థంతి సభ

హైదరాబాద్: ప్రజాయుద్ధ నౌక గద్దర్ ద్వితీయ వర్ధంతి సభ ఈ నెల 6న మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరుగతుందని గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ సూర్యకిరణ్ తెలిపారు.ఈ మేరకు ఎంఎల్సి దాసోజు శ్రావణ్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో పాటు వివిధ ప్రజాసంఘాల నేతలతో కలిసి వర్థంతి సభ పోస్టరు ఆవిష్కరిం చారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగే వర్థంతి సభలో ప్రజా ప్రతి నిధులు, సినీ ప్రముఖులు, మేధావులు, రచయితలు, కళాకారులు పాల్గొని తమ సందేశాన్ని వినిపిస్తారన్నారు.అలాగే వివిధ ప్రజా సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యమ కారులు, పాత్రికేయులు, విద్యార్ధి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారన్నారు.అలాగే రాజ్యాంగాన్ని కాపాడు కుందాం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సేనోటు డ్రగ్స్ అనే నాటికలను ప్రదర్శించటం జరుగుతుందని తెలిపారు.అలాగే గద్దర్ రాసిన సాహిత్యంలోంచి సామాజిక ఆర్థిక అసమానతల పై రాసిన పాటల ప్రదర్శన ఉంటుందన్నారు.గద్దర్ సమగ్ర సాహిత్యాన్ని ప్రచురించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న ఫౌండేషన్ రెండో వర్ధంతి సందర్భంగా గద్దర్ రాసిన మా పల్లె, ప్రతి పాటకు ఒక కథ ఉంది పుస్తకాల ఆవిష్కరణ ఉంటుందన్నారు.అలాగే గద్దర్ జీవితాంతం చేసిన కృషి, ఆచరించిన విలువలపై ఆయన స్మృతిలో అనేమంది కవులు, కళాకారులు, రచయితలు రచనలతో రూపు దిద్దుకొన్న గద్దర్ యాదిలో పాలధార పాట పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు సూర్యకిరణ్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com