సౌదీ అరేబియా, కెనడా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- August 02, 2025
ఒట్టావా: సౌదీ అరేబియా - కెనడా ఒట్టావాలో తమ తొలి రౌండ్ పొలిటికల్ సంప్రదింపుల్లో పాల్గొన్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అధికార వర్గాలు తెలిపాయి. సౌదీ అరేబియా రాజకీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ సౌద్ అల్-సటీ, కెనడా యూరప్, ఆర్కిటిక్ , మిడిల్ ఈస్ట్ వ్యవహారాల అసిస్టెంట్ డిప్యూటీ మంత్రి అలెగ్జాండర్ లెవెక్ సమావేశాల్లో తమ దేశాల టీములకు అధ్యక్షత వహించారు.
వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలపై ఇరు పక్షాలు చర్చించాయి. అదే సమయంలో పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. రెండు దేశాలు తమ తమ విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య క్రమం తప్పకుండా రాజకీయ సంప్రదింపులకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







