సూపర్ ఫీచర్ లాంచ్ చేసిన వాట్సాప్ ..
- August 02, 2025
వాట్సాప్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్.ఈ అప్లికేషన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగమైపోయింది. పర్సనల్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్లోనూ, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపుకోవడంలోనూ, వీడియో కాల్స్ చేసుకోవడంలోనూ వాట్సాప్‌కి ప్రత్యామ్నాయం లేదని చెప్పవచ్చు. చదువురాని వారు సైతం ఈ యాప్‌ను సులభంగా వాడుతున్నారు అంటే దాని యూజర్ఫ్రెండ్లీ డిజైన్ ఎంత సింపుల్‌గా ఉందో అర్థం అవుతుంది.ఇప్పుడు వాట్సాప్ మరోసారి తన యూజర్ల కోసం ఒక సూపర్ ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
కాల్ రిమైండర్ ఫీచర్
కొన్ని సార్లు బిజీగా ఉండడం వల్ల వాట్సప్ కాల్స్‌కు ఆన్సర్ ఇవ్వలేకపోతాం. ఆ తర్వాత కాల్ బ్యాక్ చేయడం కూడా మర్చిపోతాం.ఇటువంటి సమస్యకు చెక్ పెడతూ వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది..వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.22.5లో టెస్ట్ చేస్తోంది. దీంట్లో మీరు మిస్డ్ కాల్స్ కోసం రిమైండర్లను సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. 2 గంటలు, 8 గంటలు, 24 గంటల రిమైండర్ సెట్ చేసుకుని కాల్‌కు మర్చిపోకుండా ఆన్సర్ చేయొచ్చు.చాలాసార్లు మనం కాల్ మిస్ చేసి తర్వాత ఎవరికి తిరిగి కాల్ చేయాలో మర్చిపోతాము. కానీ ఇకపై అలా జరగదు. మీరు ఎవరికి తిరిగి కాల్ చేయాలో వాట్సాప్ స్వయంగా మీకు గుర్తు చేస్తుంది.
ప్రొఫైల్ అప్డేట్ ఫీచర్..
వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్‌తో యూజర్స్ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ నుండి నేరుగా ప్రొఫైల్ ఫోటోను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ డీపీని వాట్సాప్‌లో ఉంచాలనుకుంటే, ఆ ఫోటోను గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్‌గా ఫోటోను సెలక్ట్ చేసుకుంటే వాట్సాప్‌లో ప్రొఫైల్ అప్డేట్ అయిపోతుంది. ఇది సమయాన్ని ఆదా చేయడంతో పాటు ప్రక్రియను సులభతరం అవుతుంది. ఈ రెండు ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే యూజర్లకు ఇవి అందుబాటులోకి వస్తాయి.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









