విజిబుల్ పోలీసింగ్‌తో భద్రతకు భరోసా: రాచకొండ సీపీ సుధీర్ బాబు

- August 02, 2025 , by Maagulf
విజిబుల్ పోలీసింగ్‌తో భద్రతకు భరోసా: రాచకొండ సీపీ సుధీర్ బాబు

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలన్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు.ఈ రోజు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు వద్ద మదర్ డెయిరీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, అక్కడ వాహనాల పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో కలిసి కూడళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాలు, రహదారులపై సంచరిస్తూ పెట్రోలింగ్ నిర్వహించారు.స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.పెట్రో కార్లు, బ్లూ కోల్ట్స్ పర్యవేక్షణ, మహిళా పోలీసుల సైకిల్ పెట్రోలింగ్ వంటి కార్యక్రమాలను పరిశీలించి అభినందనలు తెలిపారు.

సీపీ మాట్లాడుతూ, ప్రజలకు డయల్ 100 అత్యవసర సేవలు, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, మాదకద్రవ్యాల వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు, మహిళా భద్రతకు సంబంధించి చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే చైన్ స్నాచింగ్, మొబైల్ దొంగతనాలు, సైబర్ మోసాల నివారణ మరియు రోడ్డు భద్రతపై కూడా ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు.

అనంతరం, సీపీ బురగడ్డ అనంతాచార్యులు గారి నివాసాన్ని సందర్శించి, సీనియర్ సిటిజన్ల పట్ల పోలీసు శాఖ చూపిస్తున్న శ్రద్ధను ప్రస్తావించారు.

హయత్‌నగర్ పోలీసులు చేపడుతున్న సైకిల్ పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ పర్యవేక్షణ, ఆకస్మిక వాహన తనిఖీలు వంటి విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలు నేరాల నివారణకు ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల భద్రతే తమకు ముఖ్యమని, అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com