ఒమన్ లో వినూత్న డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి..!!
- August 04, 2025
షినాస్: షినాస్‌లోని టెక్నాలజీ, అప్లైడ్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి బృందం "మీడ్" అనే వినూత్న డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. ఇది నార్త్ అల్ బటినా గవర్నరేట్ అంతటా గృహ ఆరోగ్య సంరక్షణ సేవలకు సులభతరం చేయనుంది. ఈ ప్లాట్‌ఫామ్ పేషంట్లు, సందర్శకులు వైద్యులు, క్లినిక్‌ల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తూనే వైద్య అపాయింట్మెంట్లను సులభంగా బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత ఇద్దరికీ అనువైన సౌకర్యవంతమైన యాక్సెస్ ను అందిస్తుందన్నారు.
ఈ ప్లాట్‌ఫామ్ ఒమన్ సుల్తానేట్‌లోని వివిధ గవర్నరేట్లలో 460 కి పైగా వైద్య కేంద్రాలు, క్లినిక్‌లతో పాటు రోగులు, డాక్టర్లు, కన్సల్టెంట్లతో సహా పది లక్షలకు పైగా వినియోగదారులకు సేవలు అందించిందని “నహ్జ్” ఫౌండేషన్ CEO ముఆద్ మురాద్ అల్-మామారి తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో వైద్య సేవలను విస్తృతం చేయడంతో పాటు, మందుల డెలివరీ, వర్చువల్ కన్సల్టేషన్ల వంటి కొత్త సేవలను ప్రవేశపెట్టడం ద్వారా ప్లాట్‌ఫామ్‌ను విస్తరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఒమన్‌లోని అన్ని గవర్నరేట్లను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్