3 నెలల్లో 1 మిలియన్కు పైగా వీడియోలను తొలగించిన టిక్ టాక్..!!
- August 05, 2025
యూఏఈ: 2025 మొదటి మూడు నెలల్లో యూఏఈలో టిక్టాక్ 1 మిలియన్కు పైగా వీడియోలను తొలగించింది. తమ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్పై పెద్ద ఎత్తున కఠిన చర్యలలో భాగంగా వీడియోలను తొలగించినట్లు తెలిపింది. దాదాపు 87,000 లైవ్ హోస్ట్లను నిషేధించిందని, 140,000 కంటే ఎక్కువ లైవ్స్ట్రీమ్లను మూసివేసినట్లు ప్లాట్ఫామ్ తెలిపింది. ఈ గణాంకాలను టిక్టాక్ తన తాజా Q1 2025 కమ్యూనిటీ మార్గదర్శకాల అమలు నివేదికలో వెల్లడించింది. ఈ సంవత్సరం జనవరి నుండి మార్చి వరకు, ఐదు మెనా దేశాలలో(యూఏఈ, ఈజిప్ట్, ఇరాక్, లెబనాన్, మొరాకో) 16.5 మిలియన్లకు పైగా వీడియోలు తొలగించిన్లు వెల్లడించింది.
అయితే, యూఏఈలో TikTok 98.2% ముందస్తు తొలగింపు రేటును నమోదు చేసింది. 94% ఉల్లంఘన కంటెంట్ ను 24 గంటల్లోనే తొలగించారు. ఇక ఇరాక్ లో 10 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించారు. దాదాపు 650,000 ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. ఈజిప్ట్ లో 2.9 మిలియన్ల వీడియోలను తొలగించారు. 347,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ప్రసారాలను నిషేధించారు. లెబనాన్ 1.3 మిలియన్ల వీడియోలు, దాదాపు 45,000 ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. మొరాకో 1 మిలియన్ కంటే ఎక్కువ వీడియోలను తీసివేయగా..77,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ప్రసారాలు నిషేధించినట్లు నివేదికలో తెలిపింది. అదే సమయంలో యూఏఈలో అప్పీళ్ల తర్వాత 41,148 వీడియోలను రీస్టోర్ చేసినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ







