మృతదేహాలను ఖననం చేసిన వారిలో మరో ఆరుగురు!
- August 06, 2025
కర్ణాటక: భారత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల పుణ్య క్షేత్రంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తన చేతులతో వందల మంది అమ్మాయిలను పూడ్చిపెట్టినట్లు ఎస్పీ(SP)కి లేఖ ద్వారా తెలిపాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సిట్ ధర్మస్థల పుణ్యక్షేత్రంలో తవ్వకాలు చేపట్టింది. అయితే కేవలం ఈ పారిశుద్ధ్య కార్మికుడు మాత్రమే కాదు.. మరో ఆరుగురు వ్యక్తులు మహిళల మృతదేహాలను ఖననం చేసినట్లు ముందుకు వచ్చారు. ఫిర్యాదుదారుడు చేసిన ప్రకారం సిట్ అధికారులు ఇప్పటి వరకు 13 చోట్ల తవ్వకాలు జరిపారు. ఇందులో పాయింట్ నంబర్ 6 వద్ద అస్థిపంజరం, ఎముకలు వంటివి లభ్యమయ్యాయి.
ఇప్పుడు మరో ఆరుగురు రావడంతో ఈ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఈ ఆరుగురు కూడా మృతదేహాలను ఖననం చేసిన ప్లేస్‌లో తవ్వకాలు చేపడితే ఆధారాలు దొరికే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా కంప్లైంట్ ఇవ్వకుండా ఇన్ని రోజులు వీరు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ధర్మస్థల పుణ్యక్షేత్రంలో సిట్ 13 ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. ఇందులో ఆస్థిపంజరాల ఆనవాళ్లు, వస్తువులు లభ్యమయ్యాయి. 13 స్పాట్లు మాత్రమే కాకుండా మరికొన్ని చోట్ల పూడ్చిపెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ నేత్రావతి నది పరిసర ప్రాంతాలు అన్ని కూడా 15 ఏళ్లలో పూర్తిగా మారిపోయాయి.
ఈ ప్రాంతంలో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడు మహిళలను ఈ ప్రదేశంలో ఖననం చేసినట్లు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. 1995 నుంచి 2014 సమయంలో ఇలా ఎందరో మహిళలను రహస్యంగా పూడ్చిపెట్టినట్లు లేఖలో తెలిపాడు. దీంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఓ వైద్య విద్యార్థిని కొన్నేళ్ల కిందట ఇక్కడ అనుమానాస్పదంగా కనిపించకుండా పోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదని తెలిపింది. అయితే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ పుణ్య క్షేత్రంలో ఎన్నో వందల మహిళలు, విద్యార్థినులు అదృశ్యమయ్యారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒంటరిగా అమ్మాయిలు ఇక్కడికి వెళ్లాలంటే భయపడుతున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో ఇలా ఎందరో అమ్మాయిల ఆశలన్నీ ఇక్కడే గాల్లో కలిసిపోయాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్‌లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్‌లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







