వాజ్‌పేయి, ఆర్ఎస్ఎస్ చేయలేని పని మేము చేస్తాం: సీఎం రేవంత్
- August 06, 2025
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ కు అడ్డుపడితే మోదీని గద్దె దించుతాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఎర్రకోట పై మూడు రంగుల జెండా ఎగరేసి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పారు. కేంద్రం మెడలు వంచైనా 42శాతం బీసీ రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. తెలంగాణలో రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వాళ్లకు కడుపు మంట ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో మేము రిజర్వేషన్లు అడగలేదు అని సీఎం రేవంత్ అన్నారు. మోదీ మోచేతి నీళ్లు తాగుతూ బీజేపీ నేతలు నోళ్లు మూసుకున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు మోదీ చెప్పులు మోస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద కాదు మా సవాల్.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికే నా సవాల్ అంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.
”ఈ కులగణన, జనగణన, 42 శాతం రిజర్వేషన్ దేశ రాజకీయాల్లో సునామీని సృష్టించబోతోంది. ఆ సునామీలో ఎన్డీయే బంగాళాఖాతంలో కలవబోతోంది. నరేంద్ర మోదీ కుర్చీ దిగబోతున్నారు. ఆనాడు గుజరాత్ లో జరిగిన దుర్ఘటనలతో మోదీని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మారుద్దామని వాజ్ పేయి అనుకున్నారు. అది సాధ్యపడలేదు. నిన్న కాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ ఒక మాట అన్నారు.
75 సంవత్సరాలు పూర్తైన ప్రతి ఒక్కరు పదవుల నుంచి దిగాలి. అద్వానీని, మురళీ మనోహర్ జోషిని 75 సంవత్సరాల నిబంధన పెట్టి వారిని ప్రధాన మంత్రులు చేయలేదు కాబట్టి మోదీ కూడా రేపు సెప్టెంబర్ 17కు 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. వారు ప్రధాని పదవి నుంచి దిగాలని భగవత్ చెప్పారు. కానీ, మోదీ పరమ భక్తుడు నిశికాంత్ దూబే ఒక మాట చెప్పారు. మోదీ కుర్చీ దిగరు, 2029లోనూ ఆయననే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఉంటారు అని చెప్పారు.
2029 వరకు మోదీనే కుర్చీలో ఉండాలి. 2029 ఎన్నికల్లో వాజ్ పేయి, ఆర్ఎస్ఎస్ చేయలేని పని మోదీని గద్దె దించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలోని మోదీని ఓడిస్తాం. ఢిల్లీ గద్దె నుంచి మోదీని దించుతాం. ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా” అని సీఎం రేవంత్ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!







