ట్రంప్ టారీఫ్స్ తో చేతులెత్తేసిన అమెరికా పెద్ద కంపెనీలు
- August 08, 2025
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే యుద్ధానికి సహాయం చేస్తున్నారు అనే నెపంతో భారత్ మీద 50 శాతం సుంకాలను విధించింది అమెరికా.ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పేశారు.ఈ నెల 27 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఇది జరిగి రెండు రోజులు అవుతోంది. అయితే ఈ టారీఫ్ ఎఫెక్ట్ అప్పుడే మార్కెట్ల మీద పడింది. ట్రంప్ పెంచిన సుంకాల కారణంగా అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీంతో అమెరికా ప్రజలపై భారం పెరగనుంది.
ట్రంప్ విధించిన అదనపు సుంకాల వలన ప్రభావితమయ్యే వస్తువుల్లో దుస్తులు ఒకటి. భారతదేశ వస్త్ర పరిశ్రమను ఈ సుంకాలు గట్టిగా దెబ్బతీస్తున్నాయి. అమెరికాకు మన దేశం నుంచి ఏటా సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువైన రెడీమేడ్ దుస్తులు ఎగుమతి అవుతాయి. భారత వస్త్రాలు, దుస్తులకు యునైటెడ్ స్టేట్స్ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం . మార్చి 2025 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం వస్త్రాలు, రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో మన దేశం 28 శాతం వాటాను కలిగి ఉంది. దీని మొత్తం విలువ $36.61 బిలియన్లు. ఇప్పుడు భారత్‌పై ఇతర ఆసియా దేశాలైన వియత్నాం, బంగ్లాదేశ్ కంటే ఎక్కువ సుంకాలు పడుతున్నాయి.
అనుకున్నట్టుగానే భారత వస్త్ర పరిశ్రమ మీద అప్పుడే దెబ్బ పడింది. ట్రంప్ విధించిన టారీఫ్ ల భయంతో దిగుమతులకు ఎక్కువ డబ్బు కట్టాల్సి వస్తుందని అక్కడి బడా కంపెనీలు భయపడుతున్నాయి. దీని కారణంగా స్టాక్ పంపించొద్దు అంటూ వాల్ మార్ట్, అమెజాన్, గ్యాప్, టార్గెల్ లాంటి పెద్ద కంపెనీలు భారత్ నుంచి స్టాక్ పంపించొద్దని టోకు వర్తకులకు లేఖలు, మెయిల్స్ పెడుతున్నారు. తదుపరి నోటీసులు వచ్చేవరకూ సరుకులను నిలిపివేయాలని చెప్పారు. కొనుగోలుదారులు ఖర్చు భారాన్ని పంచుకోవడానికి ఇష్టపడటం లేదని కంపెనీలు చెబుతున్నాయి.
సమాఖ్య ప్రభుత్వం వసూలు చేసే దిగుమతులపై పన్నులు అయిన సుంకాలు సాధారణంగా ఖర్చులను పెంచుతాయి, అయితే ఆ పెరిగిన ధరల భారాన్ని వ్యాపారాలు లేదా వినియోగదారులు చివరికి భరిస్తారా అనే దానిపై ఆర్థికవేత్తలలో కొంత చర్చ జరుగుతోంది.
సుంకాలు ధరలను పెంచవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ దీనికి అంగీకరించడం లేదు: గురువారం ముందు ఇప్పటికే అమలులో ఉన్న సుంకాల కారణంగా ద్రవ్యోల్బణం నెమ్మదిగా పెరుగుతోంది.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







