భారీగా పెరిగిన పసిడి ధరలు
- August 08, 2025
ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.రోజు రోజుకు పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం 1,02,560 కి చేరుకుంది. భారత్-అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇక వచ్చే అక్టోబర్ నెలలో 25 బేసిస్ పాయింట్లు రేటు తగ్గింపు అంచనాలు బంగారం ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఆగస్టు 2 నుంచి 100 గ్రాముల బంగారం ధర 26, 400 పెరగగా..10 గ్రాముల ధర 2,640 పెరిగింది. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆగస్టు 8 శుక్రవారం బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము బంగారం ధర రూపాయి పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.10,256 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము Gold ధర 9,401 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.7,692 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల Gold రూ.100 పెరిగి రూ. 10,25,600 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 100 పెరిగి రూ. 9,40,100 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ.100 పెరిగి 100 గ్రాములు రూ.7,69,200 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,560 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,010 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,920 గా నమోదైంది. విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,560 దగ్గర ట్రేడ్ అవుతోంది. చెన్నైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,560 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,010 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.77,610 గా నమోదైంది.
ముంబైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,560 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,010 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,920 గా నమోదైంది. బంగారం నకిలీదా లేక అసలైనదా అని మీ ఇంట్లోనే టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు..ఈ ఏడు చిట్కాలను పాటించండి ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,710 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. రూ. రూ.94,160 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.77,050 గా నమోదైంది. బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,560 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,010 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,920 గా నమోదైంది.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







