దోహా ఫోటోగ్రఫీ అవార్డు.. QR2 మిలియన్లకుపైగా బహుమతులు..!!
- August 11, 2025
దోహా: ఖతార్ ఫోటోగ్రఫీ అవార్డు కోసం దరఖాస్తులు ప్రారంభమైన్లు ఖతార్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆగస్టు 10 నుండి అక్టోబర్ 2 వరకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఈ అవార్డు వయస్సు లేదా అనుభవంతో సంబంధం లేకుండా, ఆరు ప్రధాన విభాగాలలో ఫోటోగ్రాఫర్‌లు తమ ఎంట్రీలను పంపాలన్నారు.
విజేతలకు QR 2 మిలియన్లకుపైగా బహుమతులను అందజేస్తామని తెలిపారు. ఖతార్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వారికి QR 300,000 వరకు గ్రాండ్ ప్రైజ్ ఇవ్వనున్నారు. ఇతర కేటగిరీలు మొదటి స్థానంలో నిలిచిన వారికి QR 150,000, రెండవ స్థానంలో నిలిచిన వారికి QR 100,000 మరియు మూడవ స్థానంలో నిలిచిన వారికి QR 75,000 బహుమతులు అందించనున్నారు.
దరఖాస్తుకు జతచేసే ఫోటోలను ప్రొఫెషనల్ కెమెరాలతో మాత్రమే తీసినవై ఉండాలని, కంప్యూటర్, కృత్రిమ మేధస్సు సాంకేతికతలను ఉపయోగించి తీసినవి కాకుడదన్నారు. ఇక లోగోలు లేదా వాటర్‌మార్క్‌ల వాడకాన్ని కూడా నిషేధించినట్లు ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ డైరెక్టర్ జాసిమ్ అహ్మద్ అల్ బుయైనైన్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..