యూఏఈలో పెర్సీడ్స్ ఉల్కాపాతం..!!
- August 12, 2025
యూఏఈః ఆగస్టు 12న యూఏఈలో పెర్సీడ్స్ కనువిందు చేయనుంది. ఆరోజున ఆకాశంలో పెర్సీడ్స్ గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నిపుణులు తెలిపారు. పెర్సీడ్స్ జూలై మధ్య నుండి ఆగస్టు చివరి వరకు ఉంటుందని, ఇది ఆగస్టు 12 నుండి 13 వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటుందని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ తెలిపింది.అయితే, వీటిని స్పష్టంగా చూడాలంటే.. సిటీకి దూరంగా చీకటి బాగా ఉన్న కొండ ప్రాంతం నుంచి వీక్షించాలని సూచించారు.కాగా, వీటిని నేరుగా కంటితో చూడవచ్చని తెలిపింది.
ఆగస్టు 12న రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు జెబెల్ జైస్లో ప్రత్యేక పెర్సియిడ్స్ చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.ఈ పెర్సియిడ్స్ సెకనుకి 59 కిలో మీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని, అ సమయంలో అవి మండిపోతాయని పేర్కొంది.
డైనోసార్ల కంటే స్విఫ్ట్-టటిల్ తోకచుక్క దాదాపు రెండు రెట్లు పెద్దగా ఉంటుందని, ఇది ప్రతి 133 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నారు. చివరిసారిగా 1992లో భూమికి దగ్గరగా వచ్చి వెళ్లిందని పేర్కొన్నారు. మళ్లీ ఙది 2126లో తిరిగి భూమికి దగ్గరగా వస్తుందన్నారు. కాబట్టి, ఈ జీవిత కాలంలో వచ్చే ఈ అరుదైన అవకాశాన్ని మిస్ కాకండి.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి