దుబాయ్ లో వేగ పరిమితులు.. డ్రైవర్ల వేగాన్ని తగ్గించడం లేదా?
- August 12, 2025
యూఏఈ: దుబాయ్‌లోని దెయిరా, బర్ దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఇరుకైన రోడ్ల కారణంగా సహజంగానే ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు కదులుతోందట. అయితే విశాలమైన వీధులతో వాహన డ్రైవర్లు అధిక వేగాన్ని ఆస్వాదిస్తున్నారని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తన తాజా సెన్సబుల్ సిటీ ల్యాబ్ అధ్యయనంలో వెల్లడించింది. డ్రైవర్ల వేగాన్ని తగ్గించడానికి వేగ పరిమితులను తగ్గించడం ఒక్కటే సరిపోదని నివేదిక స్పష్టం చేసింది.
మిలన్, ఆమ్‌స్టర్‌డామ్ మరియు దుబాయ్ అంతటా లక్షలాది ఫోటోలు, వాహన కదలికల డేటాను కృత్రిమ మేధస్సును ఉపయోగించి, పరిశోధకులు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా దుబాయ్ ప్రాంతాల మధ్య స్పష్టమైన తేడాలను నివేదిక ఎత్తిచూపింది.
డీరా వంటి అధిక సాంద్రత కలిగిన ప్రాంతాలలో కాలినడకన వెళ్లేవారికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, క్రాసింగ్ భద్రతను మెరుగుపరచడం మరియు రోడ్డు వెడల్పులో పెద్ద మార్పులు లేకుండా వాహన-పాదచారుల మధ్య సంఘర్షణలను తగ్గించడంపై దృష్టి పెట్టవచ్చుఅని సెన్సబుల్ సిటీ దుబాయ్ ల్యాబ్ లీడ్ అలా అల్ రాద్వాన్ అన్నారు. ఈ మేరకు గత నెలలో మిలన్‌లో జరిగిన ఒక సమావేశంలో ఈ అధ్యయనాన్ని సమర్పించారు.
30 కిలో మీటర్ల జోన్‌లలో వాహన డ్రైవర్లు తమ వేగాన్ని 50 కిలీ మీటర్ల రోడ్లతో పోలిస్తే కేవలం 2 నుండి 3 కిలోమీటర్లు మాత్రమే తగ్గిస్తున్నారని నివేదికలో తెలిపారు. అధిక భవనాలు కలిగిన ఇరుకైన రోడ్లు సహజంగా ట్రాఫిక్‌ను నెమ్మదిస్తాయని, అయితే పొడవైన హైవేలువేగవంతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహిస్తాయని సెన్సబుల్ సిటీ ల్యాబ్‌లోని గ్లోబల్ ల్యాబ్స్ లీడ్ మార్టినా మజ్జరెల్లో వెల్లడించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







