ఖతార్ టూరిజం: రికార్డు స్థాయిలో 2.6 మిలియన్ల విజిటర్స్..!!
- August 12, 2025
దోహా: 2025 ప్రథమార్థంలో ఖతార్లో పర్యాటక రంగం మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. జనవరి నుంచి జూన్ మధ్య 2.6 మిలియన్లకు పైగా అంతర్జాతీయ సందర్శకులు ఖతార్ ను సందర్శించారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం పెరుగుదల నమోదైంది.
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల నుండి అత్యధికంగా 36శాతం సందర్శకులు వచ్చారు. ఆ తరువాత 26 శాతం సందర్శకులు యూరప్ నుండి రాగా, ఆసియా మరియు ఓషియానియా నుండి 22శాతం , అమెరికా మరియు ఇతర అరబ్ దేశాల నుండి 7 శాతం చొప్పున సందర్శకులు ఖతార్ లో అడుగుపెట్టారని టూరిజం మంత్రిత్వ శాఖ తన తాజా రిపోర్టులో వెల్లడించింది.
సందర్శకుల రాకలో వృద్ధి కారణంగా హోటళ్ళు సగటు ఆక్యుపెన్సీ రేటు 71శాతానికి చేరుకుంది. గతేడాది కంటే 2 శాతం పెరిగిందని ఖతార్ టూరిజం చైర్మన్, విజిట్ ఖతార్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ హెచ్ ఇ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ తెలిపారు. ఖతార్ టూరిజం మొత్తం 2024లో దేశ జిడిపికి QR55 బిలియన్లను అందించిందన్నారు. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో 8శాతానికి సమానమని, అంతకుముందు ఏడాది కంటే ఇది 14% పెరుగుదల అని తెలిపారు. 2030 కల్లా ఖతార్ జీడీపీలో టూరిజం భాగస్వామ్యాన్ని 10-12%కి పెంచే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్