సౌదీ అరేబియాలో ప్రైవేట్ సంస్థలకు హెచ్చరికలు..!!

- August 13, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో ప్రైవేట్ సంస్థలకు హెచ్చరికలు..!!

రియాద్: సౌదీ అరేబియాలో ప్రైవేట్ సంస్థలకు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 20 రోజుల పాటు వేతన ఫైళ్లను సమర్పించడంలో జాప్యం చేస్తే తనిఖీలు నిర్వహిస్తామని ప్రకటించింది.  వేతన డేటాను అప్‌లోడ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ముదాద్ ప్రోగ్రామ్ సంస్థలకు ఇమెయిల్ నోటిఫికేషన్‌ లను పంపుతుంది. 10 రోజుల తర్వాత, ఫైల్‌ను సమర్పించని సంస్థలకు మరో నోటిఫికేషన్ పంపబడుతుందని, వేతనాలు చెల్లించాల్సిన 15 రోజుల తర్వాత, వేతన ఫైళ్లను సమర్పించని యజమానులకు తుది హెచ్చరిక పంపబడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎలాంటి కారణం లేకుండా 20 రోజులు దాటినట్టయితే, తప్పు చేసిన సంస్థలపై అధికారులు రైడ్స్ చేస్తారని తెలిపింది. 

కాగా, కార్మికుల జీతాల చెల్లింపులో ఆలస్యం కావడానికి గల కారణాన్ని తెలపడానికి సంస్థలకు 10 రోజుల వ్యవధి ఉంటుందని ముదద్ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. పేర్కొన్న వ్యవధిలోపు వేతనాలు అందించడంలో విఫలమైతే,  కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఒక సంస్థ రెండు నెలల పాటు జీతాల చెల్లింపులను ఆలస్యం చేస్తే, వర్కింగ్ ఆర్డర్స్ తోపాటు రెన్యువల్  మినహా అన్ని సేవలను నిలిపివేయడం ద్వారా జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. ఆలస్యం మూడు నెలలు దాటితే, అన్ని సేవలు నిలిపివేయబడతాయని, దాంతోపాటు  కార్మికుడు తన వర్క్ పర్మిట్ చెల్లుబాటులో ఉన్నప్పటికీ, ప్రస్తుత యజమాని ఆమోదం లేకుండా తన సేవలను మరొక యజమానికి బదిలీ చేసుకోవడానికి అనుమతిస్తామని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com