యూఏఈలో 5 నెలల చిన్నారిని కాపాడిన మేనత్త..!!

- August 13, 2025 , by Maagulf
యూఏఈలో 5 నెలల చిన్నారిని కాపాడిన మేనత్త..!!

యూఏఈ: అబుదాబిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 5నెలల  తన మేనల్లుడిని ఓ అత్త తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షించింది.  కేవలం 4.4 కిలోగ్రాముల బరువున్న బేబీ అహ్మద్ యాహ్యా ఆసుపత్రిలో చేరాడు. అతని లివర్ వేగంగా క్షీణిస్తోందని వైద్యలు తెలిపారు.  అతని తల్లిదండ్రులు యాహ్యా., జైనాబ్ అల్ యాస్సీ ఇప్పటికే ఒక కొడుకును ఇదే జబ్బు కారణంగా కోల్పోయారు.

ఎలాగైన తన మేనల్లుడి ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకున్నట్లు లీవర్ డొనేట్ చేసిన మేనత్త తెలిపింది. అహ్మద్ అనారోగ్యం పెరుగుతోందని, అతని కాలేయం, ఇతర ముఖ్యమైన వ్యవస్థలు ఇప్పుడు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు.  

ATP6AP1- సంబంధిత పుట్టుకతో వచ్చే గ్లైకోసైలేషన్ జబ్బు తో బేబీ జన్మించాడని వైద్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు 25 కంటే తక్కువ నమోదైనట్లు తెలిపారు.   యాహ్యా సోదరుడి భార్య లివర్ దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది.   

ఏప్రిల్ 4న, BMC యొక్క మల్టీడిసిప్లినరీ ట్రాన్స్‌ప్లాంట్ బృందం పీడియాట్రిక్ సర్జరీలను చేపట్టింది. ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ గౌరబ్ సేన్, డాక్టర్ మాథ్యూ నేతృత్వంలో, ఆపరేషన్‌కు విజయవంతంగా నిర్వహించారు. బేబీ కోలుకుంటుందని, లీవర్ చక్కగా పనిచేస్తుందని డాక్టర్లు తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com