ఖతార్ లో ఆ వాహనాల అమ్మకాలపై నిషేధం..!!
- August 13, 2025
దోహా: గల్ఫ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా లేని కొత్త లేదా యూజ్డ్ వెహికిల్స్ విక్రయాలపై ఖతార్ నిషేధం విధించింది. ఈమేరకు ఖతార్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. కస్టమర్లను మోసాల నుంచి కాపాడటం, ఆటో మొబైల్ రంగంలో హై స్టాండర్స్ వెహికల్స్ ఉత్పత్తికి ఈ ఉత్తర్వులు దోహదం చేస్తాయని తెలిపింది. తాజా నిర్ణయం అన్ని కార్ షోరూములు, డిజిటల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌లతో సహా అన్ని రకాల వాణిజ్య వాహనాలకు వర్తిస్తుందన్నారు.
తాజా సర్క్యులర్ ప్రకారం, ప్రామాణిక స్పెసిఫికేషన్లకు అనుగుణంగా లేని వాహనాలను విక్రయించడం, ప్రదర్శించడం, ప్రచారం చేయడం, సరఫరా చేయడంపై నిషేధం విధించారు. ఏవైనా ఉల్లంఘనల గురించిన సమాచారాన్ని ప్రత్యేక హాట్‌లైన్ నంబర్ 16001 ద్వారా నివేదించాలని లేదా వాణిజ్య మంత్రి పేరుతో వారి సోషల్ మీడియా ఖాతాలకు మెసేజులు పంపాలని కోరింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







