ఆసియా యూత్ గేమ్స్..యువ అథ్లెట్లను బహ్రెయిన్ స్వాగతం..!!
- August 13, 2025
మనామా: బహ్రెయిన్ లోని సఖిర్‌లోని ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లో 3వ ఆసియా యూత్ గేమ్స్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు బహ్రెయిన్ అధికారికంగా ఒక ఒప్పందంపై సంతకం చేసింది. యూత్ గేమ్స్ బహ్రెయిన్ లో అక్టోబర్ 22 నుండి 31వరకు హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆధ్వర్యంలో జరుగనున్నాయి.
సంతకాల కార్యక్రమం ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లో జరిగింది. దీనికి బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ , ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ చైర్పర్సన్ సారా అహ్మద్ బుహెజ్జీ మరియు బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ సెక్రటరీ జనరల్ ఫారిస్ ముస్తఫా అల్ కూహెజీ హాజరయ్యారు. ఈ ఒప్పందంపై గేమ్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ యూసెఫ్ డేజ్ , ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ జనరల్ మేనేజర్ అలాన్ ప్రియర్ సంతకం చేశారు. మొత్తం 24 కేటగిరుల్లో గేమ్స్ జరుగుతాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు







