ఘనంగా గాయకుడు రవీంద్రనాథ్ ఆచార్య జన్మదిన వేడుకలు

- August 13, 2025 , by Maagulf
ఘనంగా గాయకుడు రవీంద్రనాథ్ ఆచార్య జన్మదిన వేడుకలు

హైదరాబాద్: రాంకీ మెలోడీస్, మధుర వీణ మ్యూజికల్స్, ది గంటీస్ సమైక్య ఆధ్వర్యంలో, వై.ఎస్.రామక నిర్వహణలో గాయకుడు రవీంద్రనాథ్ ఆచార్య జన్మదిన వేడుకలు అలైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయి బహుగళ, బహుభాషా గాయకులు తమ గానంతో కార్యక్రమానికి మధురిమను జోడించారు.

ఈ వేడుకలకు పూర్వ డైరెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, తెలంగాణ ప్రభుత్వం బీ.రాజగోపాలరావు, కళాబ్రహ్మ డా.వంశీ రామరాజు, డా. సుధాదేవి, డా. రాజా వొజ్జల, తణికెళ్ళ రామకృష్ణ, కె.ఈ. రాజు తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

డా. వంశీ రామరాజు మాట్లాడుతూ, రవీంద్రనాథ్ ఆచార్య అనేక రంగాలలో తన ప్రతిభను నిరూపించుకున్న గాయకుడు, కళాకారుడు అని ప్రశంసించారు. తన తరఫున ఆచార్యను ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో పలువురు గాయనీ, గాయకులు ఎన్నో చిరస్మరణీయమైన సినీ గీతాలను ఆహ్లాదకరంగా ఆలపించి, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com