అనుమతి లేకుండా పర్సనల్ కంటెంట్ షేరింగ్ నేరం.. 5ఏళ్ల జైలుశిక్ష..!!
- August 14, 2025
మనామా: ప్రజల గోప్యతను కాపాడేందుకు చట్టాలను కఠినంగా అమలు చేస్తామని బహ్రెయిన్ స్పష్టం చేసింది. పర్సనల్ కంటెంట్ కు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించడం తీవ్రమైన నేరమని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. ఈ మేరకు అమన్ కార్యక్రమం కింద ఒక అవగాహన వీడియో ను విడుదల చేసింది.
చట్టంలోని ఆర్టికల్ 370 ప్రకారం ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా చిత్రీకరించడం, రికార్డ్ చేయడం లేదా పంచుకోవడం నేరమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
అలాగే అనుచిత పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను లేదా ప్రమాద బాధితులను ప్రమాద స్థలాలలో ఫోటో తీయడం వంటివి చేసిన, అనుమతి లేకుండా అలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇందుకుగాను ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 5,000 బహ్రెయిన్ దినార్ల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ ఇతరుల గోప్యతను గౌరవించాలని కోరింది.
తాజా వార్తలు
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!







