మహిళపై లైంగిక దాడి.. ఇద్దరికి జైలుశిక్ష ఖరారు..!!
- August 15, 2025
మనామా:బహ్రెయిన్ లో మహిళపై లైంగిక దాడికి పాల్పడినందుకు ఇద్దరు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్షను విధించారు. అలాగే మానవ అక్రమ రవాణాకు పాల్పడినందుకు BD2,000 జరిమానా విధించారు. బాధితురాలిని ఆమె స్వదేశానికి తిరిగి పంపడానికి అయ్యే ఖర్చును కూడా వారు భరించాలని తన తీర్పులో హై క్రిమినల్ కోర్టు ఆదేశించింది. వారి జైలు శిక్షలు పూర్తయిన తర్వాత వారిని బహ్రెయిన్ నుండి శాశ్వతంగా బహిష్కరించాలని కోర్టు తీర్పునిచ్చింది.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రైమ్ డిటెక్షన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్‌లోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డైరెక్టరేట్ రిఫర్ తో కేసు నమోదు చేసినట్లు ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ప్రాసిక్యూషన్ తెలిపింది. నిందితులు ఆ మహిళకు బహ్రెయిన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారని, బహ్రెయిన్ లో అడుగుపెట్టగానే ఆమెను ఒక ఫ్లాట్‌లో బంధించి, బలవంతంగా వ్యభిచారం చేయాలని బెదిరించారని దర్యాప్తు అధికారులు ఆరోపించారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







