ఖతార్ లో ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలపై చర్యలు..లైసెన్స్‌ సస్పెండ్..!!

- August 15, 2025 , by Maagulf
ఖతార్ లో ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలపై చర్యలు..లైసెన్స్‌ సస్పెండ్..!!

దోహా: చట్టాలు, నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలపై ఖతార్ కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా మినిమం హెల్త్ నిపుణుల సంఖ్యను పాటించడంలో విఫలమైన కారణంగా ఒక ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాన్ని ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది.

 మరొక సంఘటనలో, మరొక ప్రైవేట్ ఆరోగ్య కేంద్రంలోని ప్రసూతి మరియు గైనకాలజీ విభాగాన్ని తాత్కాలికంగా మూసివేసింది. వారి వృత్తిపరమైన లైసెన్స్ పరిధిని దాటి వ్యవహారించారని ఆరోగ్య నిపుణుల లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది.

ఆరోగ్య సంరక్షణ నిబంధనలు,  రోగి భద్రతకు సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని లేదంటే ఖఠిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రైవేట్ ఆరోగ్య సంస్థలను ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఖతార్‌లోని అన్ని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com