ఏపీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- August 15, 2025 , by Maagulf
ఏపీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమం రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో ఈ వేడుకలు జరగడం ఒక ముఖ్యమైన సంఘటనగా నిలిచింది.

చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రూ. 9.74 లక్షల కోట్ల అప్పుల భారంలో కూరుకుపోయిందని, కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తీకరణ, రైతుల సంక్షేమం కోసం రూ.68,000 కోట్లు ఖర్చు చేసినట్లు, 2014-2019 మధ్య 73% పోలవరం పనులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం అక్రమ భూకబ్జాలు, ఇసుక తవ్వకాలు, మద్యం స్మగ్లింగ్ వంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడిందని ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com