మెడికవర్‌ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ ఉచిత నిర్ధారణ శిబిరం ప్రారంభం

- August 15, 2025 , by Maagulf
మెడికవర్‌ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ ఉచిత నిర్ధారణ శిబిరం ప్రారంభం

హైదరాబాద్: 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ‘మనం సైతం’ కాదంబరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు కాదంబరి కిరణ్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్యాన్సర్‌ను భయంకరమైన వ్యాధిగా భావించే అపోహలను తొలగించాలి. తొలి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయగలిగే వ్యాధి ఇది. అందువల్ల ప్రజలు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి” అని పిలుపునిచ్చారు.

మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ డెగ్లూర్కర్ మాట్లాడుతూ, “క్యాన్సర్ నిర్ధారణలో ఆలస్యం చేయకూడదు.ఈ ఉచిత శిబిరం ప్రజలకు ఒక గొప్ప అవకాశం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేము ఉత్తమ చికిత్సను అందిస్తాము. ఈ శిబిరం ద్వారా సమయానికి సహాయం అందించడం మా లక్ష్యం” అని తెలిపారు.

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సెంటర్ హెడ్ సువన్కర్ మాట్లాడుతూ, “ప్రజల్లో క్యాన్సర్‌పై భయాన్ని తొలగించడం, అలాగే సమయానికి పరీక్షలు చేయించుకోవాలనే అవగాహన కల్పించడం మా ప్రధాన ఉద్దేశ్యం” అని అన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి, డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.

ఉచితంగా అందించే పరీక్షలు:

  • మమ్మోగ్రఫీ (రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్)
  • పాప్‌స్మియర్ (సర్వికల్ క్యాన్సర్ పరీక్ష)
  • PUS (పురుషులకు ప్రొస్టేట్ క్యాన్సర్ పరీక్ష)
  • క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్

ఈ శిబిరం ప్రతిరోజు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలకు 040 6833 4455 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com