క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్ ను సందర్శించిన ముఖ్యమంత్రి
- August 15, 2025
హైదరాబాద్: హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్రవారం ప్రారంభమైన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. తొలుత ప్రాపర్టీ షోను ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్థిరాస్తి రంగం అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అన్వితా గ్రూప్ సీఎండీ బొప్పన అచ్యుత రావు ముఖ్యమంత్రిని తమ స్టాల్ కు ఆహ్వానించి, సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వివరాలు వివరించారు. నాణ్యత, అంకితభావంతో పనిచేస్తున్న అన్విత గ్రూప్ ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు 15 నుంచి 17 వరకు కొనసాగుతుంది. 70కిపైగా ప్రతిష్టాత్మక డెవలపర్లు రూపొందించిన రేరా ఆమోదం పొందిన నివాస, వాణిజ్య ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంటాయి. ఈ కార్యక్రమంలో అన్వితా డైరెక్టర్లు బొప్పన నాగభూషణం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







