1,500 గాంధీ విగ్రహాలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- August 15, 2025
తెలంగాణ: సాధారణంగా ప్రతి ఏడాది schools లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగిపోతుంటాయి.కానీ ఈసారి రంగారెడ్డి జిల్లా పాఠశాల ఒక్క అడుగు ముందుకు వేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మన్నెగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాల స్వాతంత్ర్య వేడుకలు ఎంతో ప్రత్యేకంగా జరిపింది.ఈ పాఠశాల తన ఆవరణలో పట్టుదలతో తయారు చేసిన 1,500 గాంధీ విగ్రహాలను ప్రదర్శించింది. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్ముడు గాంధీ ఆశయాలు, ఆయన పాఠాలు ఈ తరం పిల్లలకు అర్థం కావాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.నేటి పిల్లలు గాంధీని కేవలం టెక్స్ట్ బుక్ దాటి తెలుసుకోవాలి. ఆయన అహింసా సిద్ధాంతం, సత్య మార్గం, స్వచ్ఛతపై ఉన్న నమ్మకాన్ని నిస్వార్థంగా పాటించిన గొప్ప నాయకుడిగా గుర్తుంచుకోవాలి. ఈ పాఠశాల చేసే ప్రయత్నం అదే విషయాన్ని పిల్లల దృష్టికి తీసుకురావడంలో విజయవంతమైంది.
ఈ వినూత్న ఆలోచనకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ కూడా అభినందనలతో ముందుకొచ్చింది. పాఠశాలకు ప్రత్యేక మెమొంటోను అందించి, ఈ ప్రయత్నాన్ని గౌరవించింది. ఇది ఆ పాఠశాలకు మాత్రమే కాదు, గ్రామానికి కూడా గర్వకారణంగా మారింది.వినూత్న ప్రదర్శనతో పాటు, పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో తమ ప్రతిభను చాటారు. దేశభక్తి గీతాలు, నాటికలు, గాంధీ జీవితం ఆధారిత enactments చూసిన ప్రతి ఒక్కరూ విద్యార్థుల ప్రతిభపై ప్రశంసలు కురిపించారు.
ఈ వేడుకల ప్రధాన ఉద్దేశం ఒకటే – పిల్లల్లో దేశభక్తిని నాటటం. పుస్తకాలకు పరిమితం కాకుండా, చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దేశం కోసం సేవ చేయాలనే భావన పెరగాలన్నదే నిర్వాహకుల ఆశయం.గాంధీ మార్గం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది. నేటి తరం చిన్నారులకు ఆయన గొప్పతనాన్ని అర్థం చేయించే విధంగా ఈ తరహా కార్యక్రమాలు జరిగితే, నిజంగా సద్విమర్శనీయమైన అభివృద్ధి జరుగుతుంది. గాంధీ విగ్రహాలు కేవలం శిల్పాలుగా కాకుండా, ఒక సందేశంగా నిలవాలి.ఈ పాఠశాల చేసిన ప్రయత్నం ఇప్పుడు ఇతర పాఠశాలలకు మార్గదర్శిగా మారింది. విద్య కేవలం మార్కులకే కాదు, మానవీయ విలువలకూ దోహదపడాలన్న దిశగా ఇది ఒక మంచి అడుగు.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







