లైసెన్స్ లేని విద్యా కేంద్రాల నిర్వహణ..ఆరుగురికి జరిమానాలు..!!
- August 16, 2025
మనామా: లైసెన్స్ లేని విద్యా సేవలను నడిపినందుకు ఆరుగురికి BD1,000 మరియు BD2,000 మధ్య జరిమానా విధించినట్లు లోయర్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చిందని బహ్రెయిన్ విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫీల్డ్ బృందాలు బహ్రెయిన్ అంతటా ప్రైవేట్ సంస్థలను సందర్శించిన తర్వాత ఈ కేసు నమోదైంది. మంత్రిత్వ శాఖ లైసెన్స్‌లు లేకుండా తరగతులు నడుపుతున్న ఆరు కేంద్రాలను ఇన్‌స్పెక్టర్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.
ఈ కేంద్రాలు మూడు నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు క్లాసులు నిర్వహిస్తున్నాయి. కొన్ని క్లాసులో 60 మందికిపైగా విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆయా సంస్థలు కిండర్ గార్టెన్‌లకు అవసరమైన భద్రతా నియమాలను పాటించడంలేదని, అందుకే వాటిపై కేసులు నమోదుచేసి, జరిమానాలు విధించినట్టు ఇన్‌స్పెక్టర్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!