చెన్నై టీ.నగర్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్
- August 17, 2025
తిరుమల: టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం చెన్నై టీ.నగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ టీ.నగర్ ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, గర్భాలయ విమాన గోపుర నిర్మాణం కోసం ఇంజనీరింగ్ అధికారులను ప్రణాళిక సిద్ధం చేయమని ఆదేశించినట్టు తెలిపారు. త్వరలో లోకల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి చెన్నైలోని రెండు టీటీడీ ఆలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మించాలని సంకల్పించామని, ఇప్పటికే 9 రాష్ట్రాల్లో ఆలయాలు ఉండగా మిగతా రాష్ట్రాల్లో స్థల కేటాయింపుల కోసం చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుమరగురు, మాజీ ఎల్ఏసి చైర్మన్లు శేఖర్ రెడ్డి, నూతలపాటి కృష్ణ, మాజీ సభ్యులు చంద్రశేఖర్,శంకర్ తదితరులు పాల్గొని చైర్మన్‌ను సన్మానించారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!