పార్క్, రైడ్ సేవలు ఉపయోగించుకోవాలని ఖతార్ పిలుపు..!!
- August 17, 2025
దోహా: దోహా అంతటా పబ్లిక్ రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి.. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి పార్క్ & రైడ్ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని వాహనదారులకు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ముఖ్యంగా దోహా మెట్రో స్టేషన్ల దగ్గర ప్రయాణికుల కోసం ఉచితంగా పార్కింగ్ సౌకర్యాలను అందిస్తున్నట్లు తెలిపింది.
ఖతార్ లోని పబ్లిక్ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రారంభించబడిన పార్క్ & రైడ్ స్కీమ్ కింద వాహనదారులు తమ కార్లను పార్కింగ్ చేసి, దోహా మెట్రో సర్వీసులను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రస్తుతం, అల్ వక్రా, అల్ కస్సార్, లుసైల్ మరియు ఎడ్యుకేషన్ సిటీలో పార్క్ అండ్ రైడ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. తదుపరి దశలో లుసైల్ మరియు ఎడ్యుకేషన్ సిటీ సైట్ లలో పార్కింగ్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







