మెట్రోలో లగేజ్‌ పై అదనపు ఛార్జ్

- August 17, 2025 , by Maagulf
మెట్రోలో లగేజ్‌ పై అదనపు ఛార్జ్

బెంగళూరు: బెంగళూరులోని సామాన్యుల జీవితంలో ప్రతి చిన్న ఆర్థిక భారం ఒక్కొక్కసారి సవాలు అవుతుంది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం వస్తున్న వారి కోసం నగర జీవితం సులభం కాదనే విషయం తెలిసిందే. ప్రతి అంశం, ముఖ్యంగా రవాణా, వారి జేబుకు నేరుగా తాకుతూనే ఉంటుంది. సొంత వాహనాలు ఉన్నా కూడా ట్రాఫిక్ సమస్యలు, కాలవ్యవధి ఇబ్బందులు కారణంగా చాలా మంది మెట్రోలో ప్రయాణించడమే ఎంచుకుంటారు.ఇప్పటి వరకు మెట్రో ప్రయాణ ఛార్జీలు స్థిరంగా ఉండగా, ఇప్పుడు మరో ఆర్థిక భారం ప్రయాణికుల జేబుకు రావడం ఖాయం అయింది.సదరు విధానం ప్రయాణికుల కోసం సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా, మెట్రో నెట్వర్క్ నిర్వహణలో సరిహద్దులో ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి తీసుకున్న ఒక పద్ధతి.లగేజ్ ఛార్జీ వసూలు అనేది బెంగళూరు మెట్రోలో. దేశంలోనే అత్యంత ఖరీదైన మెట్రోగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు మెట్రో(నమ్మ మెట్రో) తాజాగా మరోసారి ప్రయాణికుల జేబుకు చిల్లు పెట్టేందుకు రెడీ అయ్యింది.

ప్రయాణికుల నుంచి అదనపు లగేజ్ రుసుమును విధిస్తుంది. దీనిపై ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రయాణికులపై ఇంకెంత భారం మోపుతారని ప్రశ్నిస్తుండగా, కొందరు మాత్రం, మెట్రో నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఓ ప్రయాణికుడు అదనపు లగేజ్ ఛార్జీ (Luggage charge) గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతోంది.భారీ పరిమాణంలో ఉన్న తన లగేజీకి బెంగళూరు మెట్రో అదనంగా ఛార్జీ వసూలు చేసిందంటూ ఓ ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేస్తూ,ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. లగేజ్ మీద ఇలాంటి అదనంగా ఛార్జ్ వసూలు చేయడం ఎంతవరకు సమర్థనీయం అంటూ పోస్ట్ చేయడంతో దీనిపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది.అవినాష్ చంచల్ అనే వ్యక్తి,తన బ్యాంగ్ ఫొటో పోస్ట్ చేస్తూ, దానికిగాను బెంగళూరు మెట్రో తన దగ్గర నుంచి అదనంగా రూ.30 వసూలు చేసిందని తెలిపారు. బెంగళూరు మెట్రో ఇప్పటికే దేశంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు తెచ్చుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com