ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖ కొత్త యాప్
- August 18, 2025
హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూముల రక్షణ కోసం రెవెన్యూ శాఖ సరికొత్త డిజిటల్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. బైజాక్యుటీ సొల్యూషన్స్ రూపొందిస్తున్న ఈ యాప్ ద్వారా ప్రభుత్వ భూముల వివరాలను డిజిటల్‌గా నమోదు చేసి, జియోట్యాగ్ చేయనున్నారు.త్వరలో అందుబాటులోకి రానున్న ఈ యాప్, భూముల నిర్వహణలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడటానికి రెవెన్యూ శాఖ ఒక సరికొత్త డిజిటల్ యాప్‌ను రూపొందిస్తోంది.
బైజాక్యుటీ సొల్యూషన్స్ అనే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ దీనిని అభివృద్ధి చేస్తోంది.ఈ యాప్ ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ భూముల వివరాలను డిజిటల్‌గా నమోదు చేసి పారదర్శకంగా వాటిని పర్యవేక్షించవచ్చని అధికారులు తెలిపారు. ఈ యాప్‌లో ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు, ఇతర ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూములు, అలాగే కోర్టు కేసులలో ఉన్న భూముల వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల చుట్టూ రెడ్ మార్క్ ఏర్పాటు చేసి, వాటిని జియోట్యాగ్ చేయనున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో, డిజిటల్ మ్యాప్‌లో భూముల కొలతల్లో ఏ మాత్రం తేడా ఉండదు. ఈ యాప్ లోని జియోట్యాగ్ చేసిన చిత్రాలు, వివరాలు భూ కబ్జా ప్రయత్నాలను గుర్తించడంలో సహాయపడతాయి. అవసరమైతే, ఈ చిత్రాలను కోర్టులో చట్టపరమైన సాక్షాలుగా ఉపయోగించవచ్చు.భవిష్యత్తులో ఈ యాప్ తో ఒకే క్లిక్‌తో మొత్తం జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
దీనివల్ల అధికారులకు, ప్రజలకు సమయం అవుతుంది. ప్రస్తుతం ఆదా విధానాన్ని ప్రయోగాత్మకంగా ఒకటి, రెండు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ జిల్లా యాప్‌లో మరిన్ని అదనపు ఫీచర్లను చేర్చనున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను సందర్శించి, కబ్జాకు గురయ్యాయా లేదా కోర్టు కేసులు ఉన్నాయా వంటి వివరాలను కూడా ప్రత్యేకంగా యాప్ లో నమోదు చేస్తున్నారు. ఈ యాప్ రానున్న ఒకటి, రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఇది ప్రభుత్వ భూముల నిర్వహణలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకనుంది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







