ఆన్లైన్లో నేటి నుండి నవంబర్ నెల ఆర్జితసేవా టిక్కెట్లు
- August 18, 2025
తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామి రోజువారీ, వారాంతపు ఆర్జితసేవలకు సంబంధించి నవంబర్నెలకోటా టిక్కెట్లు సోమవారం ఉదయం నుండి టిటిడి (TTD) ఆన్లైన్లో విడుదల చేస్తోంది. ఇందుకు టిటిడి ఐటి విభాగం అన్ని ఏర్పాట్లుచేసింది.కాగా నవంబర్ నెలనుండి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాల టిక్కెట్ల దర్శన సమయం సాయంత్రం 4.30గంటలకు నిర్ణయించింది. ఈ సేవా టిక్కెట్లు ఆన్లైన్ డిప్ విధానంలో, కొన్నిసేవలు ముందువచ్చిన భక్తులకు ముందు అనే ప్రాతిపదికన ఆన్లైన్ విధానంలో భక్తులు నేరుగా బుక్చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. నేడు 18వతేదీ ఉదయం 10గంటలకు ఆన్లైన్లో ఆర్జితసేవా టిక్కెట్లు విడుదల చేస్తే 20వతేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ టిక్కెట్లు పొందిన భక్తులు 20వతేదీ నుండి 22వతేదీ మద్యాహ్నం 12 గంటలలోపు సొమ్ముచెల్లించి టిక్కెట్లు మంజూరవుతాయి.
21వ తేదీ ఉదయం 10గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలం కారసేవల టిక్కెట్లను విడుదల చేయనుంది. 212 ఆన్లైన్లో వర్చువల్ సేవా టిక్కెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయి. 23వతేదీ అంగప్రదక్షిణ టోకెన్లు ఉదయం 10గంటలకు, శ్రీవాణి బ్రేక్ టిక్కెట్లు కోటా రోజుకు 500 లెక్కన ఉదయం 23న 11 గం టలకు విడుదల చేస్తారు. వృద్ధులు దివ్యాంగులు దర్శన కోటా ఆగస్ట్ 23న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తారు.300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా 25న ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. గదుల కోటాను మధ్యాహ్నం 3గంటలకు ఆన్లై న్లో విడుదల చేస్తారు. భక్తులు ఆన్లైన్లో స్వామివారి దర్శన టిక్కెట్లును ‘టిటిదేవస్థానమ్స్. ఎపి.జివొవి.ఇన్’వెబ్సైట్స్వారా బుక్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!